NTR: ఈసారి కాలర్ అన్న ఎగరేస్తాడు.. ఎన్టీఆర్ కామెంట్స్‌తో సినిమాపై మరింత హైప్

by Chukka Sudharani |

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’

NTR: ఈసారి కాలర్ అన్న ఎగరేస్తాడు.. ఎన్టీఆర్ కామెంట్స్‌తో సినిమాపై మరింత హైప్
X

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun s/o Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి (Vijayashanti) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. తల్లీకొడుకుల సెంటిమెంట్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో హైలెవల్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో తాజాగా ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ (Pre-release and trailer launch) ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన ఎన్టీఆర్ (NTR) తన అన్న కళ్యాణ్ రామ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఈ నెల 18న మీ అందరి ముందుకు ఈ మూవీ రాబోతుంది. రాసిపెట్టుకోండి ఆకరిగా వచ్చే 20 నిమిషాలు మాత్రం థియేటర్‌లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరక్కా పోతే.. అప్పుడు అడగండి. అంత అద్భుతంగా డైరెక్టర్ ప్రదీప్ ఈ చిత్రాన్ని మలచారు. ప్రతీసారి నేను చెబుతుంటాను కాలర్ ఎగరెయ్యమని.. ఈసారి మా కళ్యాణ్ అన్నా కాలర్ ఎగరేస్తారు’ అంటూ కళ్యాణ్ రామ్ కాలర్‌ను స్వయంగా ఎరగేస్తారు ఎన్టీఆర్. ప్రజెంట్ ఇందుకు సంబంధించి వీడియో క్లిప్ వైరల్ అవుతుండగా.. ఎన్టీఆర్ కామెంట్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ శిఖరానికి చేరుకున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

Next Story