హ్యాపీ బర్త్డే బావా అంటూ ఆ స్టార్ హీరోకి విష్ చేసిన ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-08 14:38:36  IST  )

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ‘దేవర’(Devara) సినిమాతో మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు.

హ్యాపీ బర్త్డే బావా అంటూ ఆ స్టార్ హీరోకి విష్ చేసిన ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ‘దేవర’(Devara) సినిమాతో మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prasanth Neel)తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ‘వార్-2’(War-2) మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు ఎన్టీఆర్. అలాగే ఫెస్టివల్ విషెస్ కూడా తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు పెడతారు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్ బావా.. … ఈ సంవత్సరం మీకు మరిన్ని శక్తి, ప్రేమ మరియు మైలురాళ్ళు తీసుకు రావాలని కోరుకుంటున్నాను ’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story