పబ్లిక్ సపోర్ట్‌పై ఎన్టీఆర్ ట్వీట్.. రియాలిటీలో బతకమంటూ ఫ్యాన్స్ చురకలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-16 11:25:35  IST  )

‘వార్ 2’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా టాక్ సోషల్ మీడియాలో మిక్స్‌డ్‌గానే ఉంది. బాక్సాఫీస్ రన్ ఎలా ఉందో తెలియదు కానీ పనిగట్టుకుని ఫ్యాన్ వార్ చేస్తున్నవారు లేకపోలేదు.

పబ్లిక్ సపోర్ట్‌పై ఎన్టీఆర్ ట్వీట్.. రియాలిటీలో బతకమంటూ ఫ్యాన్స్ చురకలు
X

దిశ, వెబ్ డెస్క్ : ‘వార్ 2’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా టాక్ సోషల్ మీడియాలో మిక్స్‌డ్‌గానే ఉంది. బాక్సాఫీస్ రన్ ఎలా ఉందో తెలియదు కానీ పనిగట్టుకుని ఫ్యాన్ వార్ చేస్తున్నవారు లేకపోలేదు. నెగెటివ్ టాక్ తీసుకురావడంలోనూ బాగానే వర్క్ చేశారు. ఎవరు ఎలా అనుకున్నా.. తారక్ మాత్రం తన సినిమాపై పబ్లిక్ చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో నేను కూడా అంతే ప్రేమిస్తున్నానని.. పాషన్‌తో చేసిన సినిమాకు పబ్లిక్ నుంచి ఇంక్రెడిబుల్ సపోర్ట్ అందడం ఆనందంగా ఉందన్నాడు.

ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. బాలీవుడ్ డెబ్యూట్ అదిరిపోయిందన్న అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇతర హీరోల అభిమానులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటివే మానుకుని.. రియాలిటీలో బతకమని సూచిస్తున్నారు. కంప్లీట్లీ వరెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Next Story