Mad Square: అక్కడ మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ మీట్.. గెస్ట్‌గా రానున్న స్టార్ హీరో..?

by Kodari Anjali |

ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ స్వ్కేర్ (Mad Square) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Mad Square: అక్కడ మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ మీట్.. గెస్ట్‌గా రానున్న స్టార్ హీరో..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ స్వ్కేర్ (Mad Square) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), నార్నె నితిన్ (Narne Nithin), రామ్ నితిన్ (Ram Nithin) , విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని కల్యాణ్ శంకర్ (Kalyan Shankar) దర్శకత్వం వహించారు.

మార్చి 28 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ విడుదలైన ఈ మూవీ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సూపర్‌హిట్ మూవీ మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఫుల్ కాలేజీ స్టోరీ కామెడీతో ఈ మూవీలో నవ్వించగా.. కళాశాల పూర్తయ్యాక.. మూడేళ్ల తర్వాత ఏం జరిగింది అని సీక్వెల్‌లో చూపించారు దర్శకుడు కల్యాణ్ శంకర్.

ఇప్పటికే ఈ చిత్రం రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.త్వరలో వంద కోట్ల రూపాయలు కలెక్ట్ చేయనుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఈ చిత్రం భారీ విజయం అందుకోవడంతో ఏప్రిల్ 4 వ తారీకున హైదరాబాదులోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ ఈవెంట్‌కు నార్నె నితిన్ బావ జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) గెస్ట్‌గా హాజరు కానున్నారట. ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగే అంటున్నారు జనాలు. మ్యాడ్ మూవీకి కూడా తారక్ ట్రైలర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

Next Story