- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTR: అభిమానుల కోసం NTR ప్రత్యేక ప్రకటన.. దయచేసి ఎవరూ అలా చేయొద్దంటూ విజ్ఞప్తి
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) తాజాగా తన అభిమానులకు ఓ విజ్ఞప్తి (appeal) చేశాడు.

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) తాజాగా తన అభిమానులకు ఓ విజ్ఞప్తి (appeal) చేశాడు. ‘డియర్ ఫ్యాన్స్.. మీరు నాపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని.. త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ (Police Department) అండ్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల (security) సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నాను’ అని తెలియజేశారు. అంతే కాకుండా తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటనతో తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నారు.






