జూనియ‌ర్ ఎన్టీఆర్ పై ట్రోలింగ్...కార‌ణం ఇదే !

by velandi.Saikiran |

ఫోటోలు తీసేందుకు వచ్చిన కొంతమంది జర్నలిస్టులపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ అయినట్లు వీడియో బయటకు వచ్చింది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ పై ట్రోలింగ్...కార‌ణం ఇదే !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. ఫోటోలు తీసేందుకు వచ్చిన కొంతమందిపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ అయినట్లు వీడియో బయటకు వచ్చింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో తాజాగా ఓ పెద్ద హోటల్ కు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాడట. అయితే ఈ సందర్భంగా తన చుట్టూ సెక్యూరిటీ ఉన్నప్పటికీ, కొంత మంది అత్యుత్సాహం చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు తీసి వైరల్ చేసే ప్రయత్నం చేశారు.

అప్పటికీ వద్దని చెప్పినప్పటికీ, ఆయన వెనకాల వెళ్లి ఫోటోలు తీసే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే సీరియస్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ వీడియోను అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తున్నారు. మీ హీరో ఇలా తయారయ్యాడు ఏంటి ? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ సీరియస్ వర్క్ పైన ఉంటే, అలా ఫోటోలు తీయడం కరెక్టేనా ? అంటూ నిలదీస్తున్నారు. క్లిక్

Next Story