NTR : ఇంజ్యూరీ తర్వాత కూడా.. వాళ్ల కోసం షూట్‌లో జాయిన్ అయిన ఎన్టీఆర్

by Chukka Sudharani |   (  Updated:2025-09-23 15:44:44  IST  )

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్‌లో పాల్గొని గాయపడిన విషయం తెలిసిందే.

NTR : ఇంజ్యూరీ తర్వాత కూడా.. వాళ్ల కోసం షూట్‌లో జాయిన్ అయిన ఎన్టీఆర్
X

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్‌లో పాల్గొని గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎన్టఆర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు, ప్రమాదం ఏమీ లేదని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన టీమ్ ప్రకటించారు. అలాగే కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుంటారని, పూర్తిగా రికవరీ అయ్యే వరకు విశ్రాంతి తీసుకోమని ఎన్టీఆర్‌కు వైద్యులు సూచించారని తెలిపారు. అయితే.. ఇంజ్యూరీ అయిన తర్వాత రోజే ఎన్టీఆర్ రెస్ట్ లేకుండా ఆ యాడ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది.

యాడ్ షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ స్టూడియోలో ఏర్పాట్లు చెయ్యగా.. ఎన్టీఆర్ రికవరీ అయ్యే వరకు స్టూడియోలో సెటప్ అంతా అలాగే ఉంచితే రెంట్ పెరుగుతుంది. అంతే కాకుండా టీమ్ కూడా కొన్ని డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా టీమ్‌ను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ నొప్పిని భరిస్తూ కూడా ఆ యాడ్ కంప్లీట్ చేశారట. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ ఫిలిమ్ వర్గాల నుంచి బయటకు రాగా.. ఎన్టీఆర్ డెడికేషన్‌కు టీమ్ పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

Next Story