'సింగ్ గీతం' సినిమాపై NTR ప్రశంసలు.. 94 ఏళ్ల లెజెండ్ అద్భుతం సృష్టించారంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-16 04:18:49  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఈ సినిమాను, ట్రైలర్‌ను కూడా చూసి తన ట్విట్టర్ ద్వారా చిత్రబృందాన్ని అభినందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

సింగ్ గీతం సినిమాపై NTR ప్రశంసలు.. 94 ఏళ్ల లెజెండ్ అద్భుతం సృష్టించారంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ లేజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘సింగ్ గీతం’. ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాగా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతోంది. వైజయంతి మూవీస్, స్వప్న బ్యానర్స్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఇందులోని భావోద్వేగాలు సెలబ్రిటీలను సైతం ఫిదా అయ్యేలా చేస్తున్నాయి. సాధారణంగా సినిమా రిలీజ్‌కు ముందు ట్రైలర్‌ను ప్రమోషన్స్‌లో భాగంగా వదులుతారు.. కానీ ‘సింగ్ గీతం’ టీమ్ మూవీ మేకర్స్ మాత్రం థియేటర్స్‌లోకి వచ్చాక విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ‘సింగ్ గీతం’ సినిమాపై ప్రశంసలు కురిపించగా.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఈ సినిమాను, ట్రైలర్‌ను కూడా చూసి తన ట్విట్టర్ ద్వారా చిత్రబృందాన్ని అభినందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘సింగ్ గీతం’ మూవీ తన హృదయాన్ని కదిలించిందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా 94 ఏళ్ల వయసులో కూడా సినిమాపై ఉన్న అభిరుచి, సృజనాత్మక ప్రతిభతో చిత్ర పరిశ్రమను ఎంతగానో ప్రేరేపిస్తున్న సింగీతం శ్రీనివాసరావు ఎంతోమంది స్ఫూర్తిదాయమని ఎన్టీఆర్ ప్రత్యేకంగా కొనియాడారు. భారతీయ సినిమాకు దశాబ్దాలుగా సేవలు అందిస్తూ, నేటి తరం కథకులను ప్రభావితం చేస్తున్న సింగీతం గారికి ఈ చిత్రం ఒక సరైన నివాళి అని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. సింగీతం గారి చిరకాల కలను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నిర్మాత నాగ్ అశ్విన్‌ను ఎన్టీఆర్ అభినందించారు. అలాగే, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి జీవం పోసి, కథనాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసించారు. ఇక చివరగా కొంచెం హాస్యాన్ని జోడిస్తూ.. ఈ మూవీ విభిన్నమైన మార్కెటింగ్ వ్యూహాన్ని ఎన్టీఆర్ ప్రస్తావించారు. సినిమా థియేటర్లలోకి విడుదలైన తర్వాత చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచిందని, ఇలాంటి అనూహ్యమైన ప్రయోగాలు కేవలం సింగీతం గారి సినిమా స్ఫూర్తికే సాధ్యమని ఎన్టీఆర్ అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story