ఎన్టీఆర్ ఊర మాస్ లుక్‌..నరాలు తెగేలా కష్టపడుతున్నాడుగా!

by velandi.Saikiran |

నియర్ ఎన్టీఆర్ జిమ్ వీడియో బయటకు వచ్చింది. కరెంట్ తీగల సన్నగా మారిన జూనియర్ ఎన్టీఆర్... జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ

ఎన్టీఆర్ ఊర మాస్ లుక్‌..నరాలు తెగేలా కష్టపడుతున్నాడుగా!
X

దిశ‌, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని.... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్ని అవమానాలు వచ్చినా ఎదుర్కొని... తాను ఏంటో నిరూపించుకున్నారు. RRR సినిమాతో ప్రపంచ స్థాయికి ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. కేజిఎఫ్ సినిమాను మించి పోయేలా... ఈ సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దాదాపు ఫైనల్ అయినట్టే.

అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే... అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ జిమ్ వీడియో బయటకు వచ్చింది. కరెంట్ తీగల సన్నగా మారిన జూనియర్ ఎన్టీఆర్... జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కల్పించాడు. నరాలు తెగేలా... కసరత్తులు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ... జూనియర్ ఎన్టీఆర్ చేతి పైన ఓ సింబల్ కనిపించింది. ఓం అనే సింబల్ ను సూచించేలా ఇది ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమా మొత్తం దేవుడు చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో వస్తుందా...? అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. క్లిక్

Next Story