- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెల్‌బోర్న్‌లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు.. సేవలు, సిద్ధాంతాలను కొనియాడిన వక్తలు
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ‘ఎన్నారై తెలుగుదేశం’, స్థానిక తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సినీ వజ్రోత్సవ వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. వేలాది మంది ప్రవాస భారతీయులు, ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ‘ఎన్నారై తెలుగుదేశం’, స్థానిక తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సినీ వజ్రోత్సవ వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. వేలాది మంది ప్రవాస భారతీయులు, ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా ఎన్టీఆర్, బాలకృష్ణ చిత్రాల పాటలతో అలరించిన ప్రదర్శనలు ఆకర్షణీయంగా నిలిచాయి. ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాటకు రూప అనే నృత్యకారిణి చేసిన నృత్యం సభికులను మంత్రముగ్ధులను చేసింది.
ఈ వేడుకకు భారత్ నుంచి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నందమూరి రామకృష్ణ, బోడే ప్రసాద్, నారా రోహిత్, అశ్విన్ అట్లూరి తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎన్టీఆర్ తెలుగు సత్తాను ప్రపంచానికి చాటారు: నందమూరి రామకృష్ణ
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ కార్యాలయాలపై తెలుగు బోర్డులు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తి తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా నడిపిస్తుందని, ఆయన బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని అన్నారు. తెలుగువాడు ఎక్కడున్నా తెలుగుదేశం అక్కడ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం గొప్ప అవకాశం: సోమిరెడ్డి
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ.. ఈ వేడుకలో పాల్గొనడం తనకు గౌరవంగా ఉందని అన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి విజయంలో ఎన్నారైల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. 2019-24 మధ్య రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన నడిచిందని, తనపై 18 కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తాను పోరాడినా కేసులు పెట్టలేదని గుర్తుచేశారు. జగన్ హయాంలో మద్యం కుంభకోణంతో వేల కోట్లు దోచుకున్నారని, నాసిరకం మద్యంతో 68 మంది తన నియోజకవర్గంలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, లోకేష్ సమర్థవంతమైన పనితీరును ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని తెలిపారు.
ఎన్టీఆర్ సినిమా, రాజకీయాల్లో అసమాన నాయకుడు: టీడీ జనార్దన్
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ మాట్లాడుతూ, సినిమా, రాజకీయాల్లో ఎన్టీఆర్ అసమాన నాయకుడని కొనియాడారు. ఆయన వైవిధ్యభరిత పాత్రలు ప్రపంచ సినీ చరిత్రలోనే సమానం లేనివని, నటనతోపాటు దర్శకత్వం, నిర్మాణంలోనూ మునిగారని చెప్పారు. రాయలసీమ కరవు, చైనా యుద్ధం, దివిసీమ తుపాను సమయంలో ప్రజలకు అండగా నిలిచారని, రెండు రూపాయలకు కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తిహక్కు, వృద్ధులకు పెన్షన్లు వంటి విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు. నదుల అనుసంధానం గురించి మొదట ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన పాలసీలు దేశానికి ఆదర్శమని అన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ద్వారా ఆయన భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి సహకరించిన చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్, మెల్‌బోర్న్ ఎన్నారై తెలుగుదేశం, తెలుగు సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.






