- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTR: జపాన్‌లో నాగచైతన్యపై ఎన్టీఆర్ కామెంట్స్.. నెట్టింట వైరలవుతోన్న వీడియో!
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) అక్కినేని నాగచైతన్యపై (Akkineni Nagachaitanya)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దేవర (Devara) మూవీ జపనీస్ వర్షన్ నిన్న (మార్చి 28) అక్కడ విడుదల అయిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తారక్ వారం రోజులుగా అక్కడే ఉండి.. భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. జపాన్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు ఎన్టీఆర్. తారక్‌కు జపాన్ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పి.. ప్రేమను చూపిస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా తారక్ జపాన్ వారు చూపిస్తోన్న అభిమానాన్ని చూసి మురిసిపోయాడు. దీంతో దీనిపై నెట్టింట ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ఎన్టీఆర్ కామెంట్స్ జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య గురించి మాట్లాడాడు. ఫుడ్ గురించి టాపిక్ రాగా.. హైదరాబాదులో నా స్నేహితుడు షోయు అనే రెస్టారెంట్ నడుపుతున్నాడని తెలిపాడు.
అతనెవరో కాదు.. నాగచైతన్య అని చెప్పారు. ఆయన కూడా నటుడేనని.. అక్కడ ప్యూర్ జపనీస్ ఫుడ్ (Japanese food) దొరుకుందని.. నేను అయితే సుషీ బాగా తింటానని వెల్లడించారు. టేస్ట్ చాలా బాగుంటుందని.. మీరు తప్పకుండా షోయు లో తినడానికి ప్రయత్నించండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తారక్ ఆసక్తికర కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






