- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. కానీ నేను మీ సన్నిధిలో ఉంటే నా గమ్యాన్ని చేరుకుంటాను.. నాని హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా నాని(Nani) సరసన ‘హిట్-3’(Hit-3) మూవీలో నటించి మెప్పించింది.ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీనిధి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో లింగ భైరవి అమ్మవారిని దర్శించుకుంది. అక్కడ పూజలు చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘జీవితంలో చాలా విధాలుగా జరుగుతుంది. కొన్ని విషయాలు మాయాజాలంగా ఉంటాయి, మరికొన్ని అలా ఉండకపోవచ్చు. ఏదీ శాశ్వతం కాదు లేదా హామీ ఇవ్వబడదు. కానీ నేను మీ కృపలో ఉన్నంత వరకు నేను నా గమ్యాన్ని చేరుకుంటానని నాకు తెలుసు దేవి’ అంటూ నమస్కరిస్తున్న ఎమోజీ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.






