Samantha: ఇక్కడ ఏది స్థిరంగా ఉండదంటూ సమంత సంచలన పోస్ట్.. నాగచైతన్యను ఉద్దేశించేనా?

by Mallepaka Hamsa |

సమంత(Samantha) గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే.

Samantha: ఇక్కడ ఏది స్థిరంగా ఉండదంటూ సమంత సంచలన పోస్ట్.. నాగచైతన్యను ఉద్దేశించేనా?
X

దిశ, సినిమా: సమంత(Samantha) గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే. ‘ఏమాయ చేసావే’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాగార్జున, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం మున్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. పెళ్లైన కొద్ది రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇక భర్తతో విడిపోయిన తర్వాత ఆమె మయోసైటీస్ బారిన పడటంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరగా.. ‘ఖుషి’ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే ఉంటూ పలు విషయాలు తెలుపుతోంది. అంతేకాకుండా ఓ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసి ఆరోగ్యానికి సంబంధించినవి చిట్కాలు చెప్తుంది. ఇక నాగచైతన్య విషయానికొస్తే.. ఆయన శోభిత(Sobitha Dhulipala)ను ప్రేమించి ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన విడాకుల గురించి పలు షాకింగ్ కామెంట్లు చేశారు. పెళ్లి ప్రకటన చేశాక చాలా మంది శోభిత గురించి తప్పుగా మాట్లాడారని ఇందులో తన తప్పులేదని అన్నారు. సమంత, నేను ఇద్దరం ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు.

ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో.. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది. అందులో ఏముందంటే.. ‘‘ఒక మనిషిగా ఈ ప్రపంచంలో మీరు శాశ్వతం కాదు. ఇది ఎప్పటికప్పుడు మారుతూ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇక్కడ ఏదీ స్థిరంగా ఉండదు. ఈ ప్రపంచంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు’’ అనే కొటేషన్ షేర్ చేసింది. ప్రస్తుతం సమంత పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు నాగచైతన్య, శోభితను ఉద్దేశించే ఇండైరెక్ట్‌గా అలాంటి పోస్ట్ చేసిందని అంతా చర్చించుకుంటున్నారు. అలాగే వీరిద్దరికి స్ట్రాంగ్ కౌంటర్ వేసిందని అంటున్నారు.

Next Story