- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sanya Malhotra: సౌత్‌లోకి మరో నార్త్ బ్యూటీ.. ఏ సినిమాతో రాబోతుందంటే?
‘దంగల్’ (Dangal) చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నార్త్ బ్యూటీ సన్యా మల్హోత్రా (Sanya Malhotra).

దిశ, సినిమా: ‘దంగల్’ (Dangal) చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నార్త్ బ్యూటీ సన్యా మల్హోత్రా (Sanya Malhotra). తన నటన, అందంతో మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. గతేడాది ‘జవాన్’ (Jawan) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు సన్యా.. సౌత్ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ హీరోయిన్‌ను సౌత్ ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డాడట టాప్ మోస్ట్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam). ఆయన దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ థగ్‌లైఫ్ (Thug Life).
కమల్ హాసన్ (Kamal Haasan), శింబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రెడ్ జాయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చెయ్యగా.. సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది. ఇక రిలీజ్‌కు ముందు ఈ సినిమా భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రంలోకి నార్త్ బ్యూటీ సన్యా మల్హోత్రాను తీసుకురాబోతున్నాడట మణిరత్నం. ఇందులో సన్యా పాత్ర కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా హిట్ అయితే.. సౌత్ ఎంట్రీ సన్యాకు ప్లెస్ అవుతోంది అంటున్నారు నెటిజన్లు. కాగా.. ‘థగ్‌లైఫ్’ సినిమా జూన్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది.






