Nora Fatehi : నోరా ఫాతేహి స్పెషల్ సాంగ్.. ట్రెండింగ్‌లో దిల్బార్ కి ఆంఖోన్ కా

by Chukka Sudharani |

మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లోకి బోల్డ్ బ్యూటీ నోరా ఫాతేహి ఎంట్రీ ఇచ్చింది.

Nora Fatehi : నోరా ఫాతేహి స్పెషల్ సాంగ్.. ట్రెండింగ్‌లో దిల్బార్ కి ఆంఖోన్ కా
X

దిశ, సినిమా: మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లోకి బోల్డ్ బ్యూటీ నోరా ఫాతేహి ఎంట్రీ ఇచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న లేటెస్ట్ హారర్ మూవీ ‘థామ’. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో నాల్గవ భాగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘థామ’ నుంచి స్పెషల్ సాంగ్ ‘దిల్బర్ కీ ఆంఖోన్ కా’ను రిలీజ్ చేస్తూ.. ‘నోరాఫతేహి మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లోకి తిరిగి వచ్చేసింది.. ‘దిల్బార్ కి ఆంఖోన్ కా’ మ్యాజిక్‌తో ఈ దీపావళి కాంతులను మరింత మెరిపిస్తుంది.. మిమ్మల్ని మీరు మైమరిచిపోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ పోస్ట్ పెట్టారు. ఇక ఈ సాంగ్‌లో నోరా.. తన డ్యాన్స్ అండ్ గ్లామర్‌తో ఆకట్టుకోగా.. ప్రజెంట్ ఇది ట్రెండీగా మారింది. కాగా.. ఈ థామ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నాడు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది థామ.

Next Story