- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్ ఇదే.. : నోరా ఫతేహి
డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి.. నటిగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామల్లో..

దిశ, వెబ్‌డెస్క్: డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి.. నటిగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామల్లో నోరా ఫతేహి ఒకరు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో కపల్ శర్మ షోలో పాల్గొనప్పుడు నోరా ఫతేహి తన అందం, గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న సీక్రెట్ ను చెప్పింది. వైరల్ అవుతున్న వీడియోలో కపిల్ శర్మ.. నోరా మీ స్కిన్ ఇంత గ్లోయింగ్ గా ఉండటానికి కారణమేంటి? ఏం తింటారు? మీ డైలీ రొటీన్ ఏంటి? అని ప్రశ్నించారు.
ఇందుకు నోరా నవ్వుతూ సమాధానమిచ్చింది. తాను పాస్తా, అన్నం, పప్పు, రోటీ, ఉడికించిన బంగాళదుంపలు తింటానని తెలిపారు. తనకు కారు లేదని, ఆటో రిక్షాలోనే జర్నీ చేస్తానంటూ చమత్కారంగా చెప్పారు. నోరా విషయానికొస్తే.. స్పెషల్ సాంగ్స్ తో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. బాట్లా హౌస్, స్ట్రీట్ డ్యాన్సర్ 3D, మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ వంటి సినిమాలతో నటిగా ప్రూవ్ చేసుకున్నారు. కొన్ని డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం నోరా.. రాఘవ లారెన్స్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న కాంచన 4 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో నోరా సౌత్ ఆడియన్స్ కు చేరువ కానున్నారు.






