- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్రొడ్యూసర్‌తో చేసే సినిమాకు నో రెమ్యునరేషన్.. టాలీవుడ్ హీరో పై ప్రశంసలు
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ఆయన ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) సినిమాతో మన ముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటించారు.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కించారు. అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఈ క్రమంలో హీరో శర్వానంద్ చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా నారి నారి నడుమ మురారి సక్సెస్ మీట్‌లో పాల్గొన్న శర్వానంద్ మాట్లాడుతూ.. ‘నాకు అనిల్ గారు అని పిలవడం కంటే అనిల్ అన్నా అని పిలవడం చాలా ఫీలింగ్ ఉంటది.
ఒక హీరో ప్రొడ్యూసర్ కలిస్తే ఏమవుతుంది అనేది మేము చూపిస్తాము. నేను ప్రామిస్ చేస్తున్నాను నా నెక్స్ట్ సినిమాను నిర్మాత అనిల్ సుంకరతో చేస్తాను. అయితే అతను చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు తీసే స్థాయికి వెళ్లే వరకు అతనితో ఎన్ని సినిమాలు చేసినా పారితోషికం తీసుకోను’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇది విన్న అతని ఫ్యాన్స్, నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






