- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నో ఎక్స్‌ట్రా చార్జ్.. ఓన్లీ ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్.. గుడ్ న్యూస్ చెప్పిన నారి నారి నడుమ మురారి మూవీ టీమ్
టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanandh) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanandh) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari). సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో ఈ మూవీ టీమ్ ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ..‘ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్.. MRP ధరలకే టికెట్లు.. అదనపు చార్జీలు లేకుండా నారి నారి నడుమ మురారిని పొందండి..
నో ఎక్స్‌ట్రా చార్జ్.. ఓన్లీ ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్’ అంటూ రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో శర్వానంద్ తెల్ల పంచా కట్టుకొని చేతిలో పెద్ద కోడి పుంజును పట్టుకొని ఉన్నాడు. ఇక అతని బ్యాక్ గ్రౌండ్‌లో భోగి మంటలు, నైవేథ్యం చేస్తున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






