- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాకు సెన్సార్ పూర్తి.. సింగిల్ కట్ కూడా పడలేదన్న మేకర్స్
ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో నారీ నారీ నడుమ మురారి ఒకటి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తోన్న ఈ సినిమా.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతి రేసులో నిలబడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో నారీ నారీ నడుమ మురారి ఒకటి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తోన్న ఈ సినిమా.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతి రేసులో నిలబడుతోంది. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు.. ఒక్క సింగిల్ కట్ కూడా చేయలేదని మేకర్స్ తెలిపారు. నారీ నారీ నడుమ మురారి ప్రేక్షకుల్ని కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. సినిమాను జనవరి 14వ తేదీ సాయంత్రం 5.49 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించగా.. ముచ్చటగా మూడోసారి శర్వానంద్ సంక్రాంతికి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.






