Bhumi Pednekar: ఏ నటి ఇలాంటి సాహసం చేయలేదు.. వైరల్‌గా బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్

by Chukka Sudharani |

ఇండస్ట్రీలో నిలబడాలి అంటే శారీరకంగా ఎన్నో మార్పులు చేసుకోవాలి అంటుంది బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్.

Bhumi Pednekar: ఏ నటి ఇలాంటి సాహసం చేయలేదు.. వైరల్‌గా బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో నిలబడాలి అంటే శారీరకంగా ఎన్నో మార్పులు చేసుకోవాలి అంటుంది బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. సినీ కెరీర్ గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. ‘దశాబ్ద కాలంగా చిత్రపరిశ్రమలో నా ప్రయాణం సాగుతోంది. పాత్రల కోసం ఎన్నో శారీకర మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇలా ఏ నటి కూడా చేయలేదేమో. అలాగే నా కెరీర్‌లోనే ‘ది లేడీ కిల్లర్’ చిత్ర వైఫల్యం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇక నా పనైపోయిందనుకున్న. మొదట నాకు ఇచ్చిన స్క్రిప్ట్‌లో నా పాత్ర పరిపూర్ణంగానే ఉంది. కానీ అందులో చాలా భాగాల్ని తెరకెక్కించలేదు. అసంపూర్తిగా సినిమాను విడుదల చేశారు. ఇది నాకు ముందే తెలిసుంటే బాగుండేది. నేను కూడా మేకింగ్‌లో భాగమై ఉంటే కొన్ని విషయాల్ని మార్చగలిగేదాన్ని. అయినా జరిగినదానికి నేను చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే గతంలో ఎప్పుడూ అలా జరగలేదు. ఈ సినిమా పరిస్థితి ఏంటా అని భయపడ్డాను. చివరకు ఇదొక గుణపాఠంలా భావించి నాకు నేను సర్దిచెప్పుకున్నా’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ‘అధూరే హమ్ అధూరే తుమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Next Story