- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలా ఉండేది.. ఎలా మారిపోయింది.. హీరోయిన్ పై ట్రోలింగ్ !
టాలీవుడ్ స్టార్ నటి నివేదా థామస్ ( Nivetha Thomas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ నుంచి వచ్చి టాలీవుడ్ లో

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ నటి నివేదా థామస్ ( Nivetha Thomas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ నుంచి వచ్చి టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది నివేదా థామస్. 2002 సంవత్సరంలో మలయాళ చిత్రం ద్వారా బాలనాటిగా పరిచయమైన నివేదా థామస్... ఆ తర్వాత హీరోయిన్ గా కూడా రాణించింది. దాదాపు మూడు సినిమాల్లో బాలనటిగా మెరిసింది.
ఇటు తెలుగులో జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది నివేదా థామస్. ఈ సినిమా 2016 లో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, బ్రోచేవారెవరు, దర్బార్, వి, వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో మెరిసింది. అయితే అలాంటి నివేదా థామస్... తాజాగా గద్దర్ అవార్డ్స్ ( Gaddar awards) ఫంక్షన్ లో మెరిసింది.
బెస్ట్ ఫిమేల్ లీడ్ అవార్డు దక్కించుకున్న నేపథ్యంలో.. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా... చీరలో గద్దర్ ఈవెంట్ కు వచ్చారు నివేదా థామస్. ఈ సందర్భంగా ఆమె లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో చాలా సన్నగా ఉండే నివేదా థామస్... ఇప్పుడు చాలా లావు అయిపోయారు. గతానికి, ఇప్పటికీ ఏమాత్రం పోలిక లేకుండా మారిపోయారు. ఇక ఆమెను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. నివేదా థామస్ ఇలా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.






