నితిన్ "తమ్ముడు" నుండి మరో ట్రైలర్ విడుదల

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-02 07:50:01  IST  )

నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.

నితిన్ తమ్ముడు నుండి మరో ట్రైలర్ విడుదల
X

దిశ‌, వెబ్ డెస్క్: నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ ప్రధాన పాత్రల్లో నటించారు. అంతే కాకుండా సీనియ‌ర్ హీరోయిన్ ల‌య నితిన్‌కు అక్కగా నటించారు. సినిమా టైటిల్‌కు తగినట్టుగానే ఈ చిత్రం అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా ఇప్పుడు మరో ట్రైలర్ కూడా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నితిన్‌కు సరైన హిట్ లేదనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Next Story