- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nithin : హార్స్ రైడర్‌గా హీరో.. కొత్త సినిమా అప్డేట్‌తో ఆనందంలో ఫ్యాన్స్
హీరో నితిన్ రీసెంట్‌గా ‘తమ్ముడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దిశ, సినిమా: హీరో నితిన్ రీసెంట్‌గా ‘తమ్ముడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కింది. ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా..లయ, వర్ష బొల్లమ్మ, స్వస్తిక విజయ్, సౌరబ్ సచ్ దేవ్ కీలక పాత్రలో కనిపించారు. దిల్ రాజ్ నిర్మించారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ నెల 4న థియేటర్స్‌లో విడుదలై బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది.
అంతే కాకుండా.. నెల రోజులు కూడా కాకముందే ఆగస్టు 1వ తేదీ నుంచి ఓటీటీ వేదికగా.. ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నితిన్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నో విభిన్న క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న ఈ హీరో.. ఇప్పుడు హార్స్ రైడర్‌గా వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడట. ఈ సినిమాకు విక్రమ్ కె.కుమార్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లాక్ చేయబడినట్లు ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. అంతే కాకుండా.. దీనికి ‘స్వారీ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట మేకర్స్. ఇక త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






