Nithin: యంగ్ బ్యూటీ రూమ్‌లో అడ్డంగా దొరికిపోయిన హీరో నితిన్.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో

by I. Sairam |   (  Updated:2025-07-28 17:56:09  IST  )

‘జయం’(Jayam) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నితిన్(Nithin) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Nithin: యంగ్ బ్యూటీ రూమ్‌లో అడ్డంగా దొరికిపోయిన హీరో నితిన్.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో
X

దిశ, సినిమా: ‘జయం’(Jayam) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నితిన్(Nithin) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో నితిన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’(Robbin Hood) మూవీలో నటిస్తున్నాడు హీరో నితిన్. వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో నితిన్, శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. నితిన ఓ రూమ్‌లో ఉండగా, ఆ గదికి ముందు ఉన్న బోర్డుపై హీరో అని రాసి ఉంటుంది. అయితే శ్రీ లీల ఆ బోర్డును హీరోయిన్ అని చేంజ్ చేసి లోపలికి వెళ్తుంది. ఇక సడెన్‌గా తన రూమ్‌లో ఉన్న హీరో నితిన్‌ని చూసి షాక్ అయ్యి.. ‘మీరు నా గదిలో ఉన్నారేంటి’ అని నితిన్‌ను ప్రశ్నిస్తుంది. అయితే దీనికి నితిన్.. ‘ఇది నా గది’ అంటూ శ్రీ లీలకు చెబుతూ బయటకు వచ్చి చూడగానే హీరోయిన్ అని రాసి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే హీరోయిన్ అనే పదాన్ని తొలగించి, హీరో అని రాసి చూశావా హీరో అనే ఉంది అంటూ శ్రీ లీలకు కౌంటర్ ఇస్తాడు. ఇక లాస్ట్‌కు ‘రాబిన్ హుడ్’ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు తెలియజేస్తారు. కాగా ఈ వీడియో మూవీ ప్రమోషన్ కోసం చేసినట్లు తెలుస్తోంది.

Click For Video..

Next Story