ఆ తేదీన రీ-రిలీజ్ కానున్న నిన్ను కోరి

by Pulgam srinivas |

నిన్ను కోరి చిత్రాన్ని మే 8వ తేదీన పెద్ద ఎత్తున రీ-రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఆ తేదీన రీ-రిలీజ్ కానున్న నిన్ను కోరి
X

దిశ, వెబ్ డెస్క్: నాని హీరోగా రూపొందిన లవ్ రొమాంటిక్ చిత్రాలలో ‘నిన్ను కోరి’ ఒకటి. ఇందులో నివేదా థామస్ హీరోయిన్‌గా నటించగా, ఆది కీలకమైన పాత్రలో నటించాడు. శివ నిర్వాణ ఈ చిత్రంతోనే దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. 2017లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీని మరికొన్ని రోజుల్లో రీ-రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని మే 8వ తేదీన పెద్ద ఎత్తున రీ-రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రీసెంట్ టైంలో లవ్ రొమాంటిక్ చిత్రాలకు రీ-రిలీజ్‌లో భాగంగా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి. గోపి సుందర్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు కోనా వెంకట్ స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి దానయ్య నిర్మించారు.




Next Story