Nikhil Siddhartha: కనీసం దానికైనా అనుమతించండి.. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సీరియస్ పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

ప్రస్తుతం సినిమాల టికెట్స్ రేట్స్ పెంచడంపై ఇష్యూ నడుస్తున్న విషయం తెలిసిందే.

Nikhil Siddhartha: కనీసం దానికైనా అనుమతించండి.. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సీరియస్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : ప్రస్తుతం సినిమాల టికెట్స్ రేట్స్ పెంచడంపై ఇష్యూ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ సీరియస్ పోస్ట్ పెట్టాడు. ‘అధిక టికెట్ ధరలకు లిమిట్ విధించాలి.. కానీ దాని కంటే పెద్ద సమస్య ఏమిటంటే.. థియేటర్స్‌లో అమ్మే పాప్‌కార్న్ అండ్ కూల్‌డ్రింక్స్. వీటికి పిచ్చిగా పిచ్చిగా ధరలు పెంచేసి ఆడియన్స్‌పై రుద్దేస్తున్నారు. నేను రీసెంట్‌గా ఒక సినిమాను థియేటర్‌లో చూశాను.. అసలు సినిమా కంటే స్నాక్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేశాను.

బిగ్ స్క్రీన్‌పై ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదించేలా చేయడానికి దయచేసి ఇలాంటి ఇష్యూలను పరిష్కరించాలని పంపిణీ వర్గాలను నేను రిక్వెస్ట్ చేస్తున్నారు. కనీసం మా వాటర్ బాటిళ్లను థియేటర్లలోకి తీసుకెళ్లడానికైనా అనుమతించండి’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. చాలా మంది సిద్ధార్థ్‌కు మద్ధతును ఇస్తున్నారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే.. స్వయంభు, ది ఇండియా హౌస్ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు.లింక్

Next Story