- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Niharika Konidela: నిర్మాతగా సెకండ్ మూవీ స్టార్ట్ మెగా డాటర్.. డైరెక్టర్ ఎవరంటే?
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) యాంకర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) యాంకర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఒక మనసు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. పలు మూవీస్ తీసినప్పటికీ హీరోయిన్‌గా అనుకున్నంత క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం నిర్మాత(producer)గా మారి సినిమాలు తీస్తుంది. అలా ఫస్ట్‌గా తీసిన మూవీ ‘కమిటి కుర్రోళ్లు’ (Committee Kurrollu). చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇక మొదటి సినిమానే నిహారికకు లాభాలు తెచ్చిపెట్టడంతో.. సక్సెస్ ఫుల్ నిర్మాత(Successful producer)గా తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మెగా డాటర్ నిర్మాతగా తన రెండో సినిమా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్(Pink Elephant Pictures banner)పై నిహారిక కొణిదల నిర్మాణంలో ఫిమేల్ డైరెక్టర్ మానస శర్మ(Manasa Sharma)తో సినిమా చేయనుంది. మానస శర్మ గతంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లోనే క్రియేటివ్ డైరెక్టర్‌గా ‘ఒక చిన్న ఫ్యామిలి స్టోరీ’ (జీ 5 వెబ్ సిరీస్), డైరెక్టర్‌గా ‘బెంచ్ లైఫ్’ (సోనీ లివ్ వెబ్ సిరీస్) చేశారు. ఇప్పుడు నిహారిక, మానస శర్మ కాంబినేషన్‌లో ఓ ఫీచర్ ఫిల్మ్ రాబోతుంది. అయితే.. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. నిర్మాతగా ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకున్న నిహారికకు ఈ రెండో సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.






