Niharika: నా నెక్స్ట్ మూవీ అతనితోనే.. బడ్జెట్ 25 కోట్లు

by Pulgam srinivas |

ఆట డాన్స్ షోలో భాగంగా సుధీర్‌ను ఆటపట్టించిన నిహారిక, రాధిక.

Niharika: నా నెక్స్ట్ మూవీ అతనితోనే.. బడ్జెట్ 25 కోట్లు
X

దిశ, వెబ్ డెస్క్: నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కానీ విజయాలు మాత్రం పెద్దగా దక్కలేదు. దాంతో ఈ నటి ప్రస్తుతం నిర్మాతగా టర్న్ తీసుకుంది. ఇప్పటికే పలు చిత్రాలను నిర్మించి వాటితో మంచి విజయాలను అందుకుంది. తాజాగా కూడా రాకాస చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ ప్రొడ్యూసర్ ఆట అనే టెలివిజన్ కార్యక్రమాన్ని కూడా నిర్మిస్తోంది. ఇందులో భాగంగా నిహారిక చేసిన ఒక ఫన్నీ సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ డాన్స్ షోకు సుడిగాలి సుదీర్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగా నిహారిక మాట్లాడుతూ — “నేను ఎప్పటి నుంచో సుదీర్‌తో ఒక సినిమా నిర్మించాలని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని మా తండ్రికి కూడా చెప్పాను. ఆయన కూడా అందుకు ఓకే చెప్పారు. 25 కోట్ల బడ్జెట్‌తో అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌లో ఆయనతో సినిమా చేయాలని నేను అనుకుంటున్నాను,” అని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత అదే షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న రాధిక శరత్‌కుమార్ కూడా స్పందిస్తూ — “మా ఆయన శరత్‌కుమార్ గారికి కూడా సుదీర్ బాగా నచ్చాడు. నేను కూడా ఓ సినిమాను ఆయనతో చేయాలి అనుకుంటున్నాను. దానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తాడు,” అని సరదాగా అంది. దాంతో సుదీర్ స్పందిస్తూ — “నేను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను. కేవలం నిహారిక సినిమానే చేస్తాను,” అని అన్నాడు. ఆ తర్వాత ఇదంతా ఫ్రాంక్ అని చెప్పి సుదీర్‌ను అందరూ సరదాగా ఆట పట్టించడం జరిగింది. ఇలా నిహారిక, రాధిక, సుదీర్ మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

Next Story