- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Niharika : ఆ షో స్టార్ట్ చేశాక మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోలేదు
Niharika : నేను దాదాపు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 2015లో డీ జూనియర్స్ అనే షోను స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసిన తర్వాత నుండి మా నాన్నగారిని ఎప్పుడూ డబ్బులు అడగలేదు అని ఈమె చెప్పకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : కొణిదల నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చాలా సంవత్సరాల క్రితమే నటిగా వెండితెరకు పరిచయం అయింది. కానీ ఈమె చాలా సినిమాల్లో నటించినా మంచి విజయం మాత్రం దక్కలేదు. ఆర్టిస్టుగా చాలా ఫెయిల్యూర్లను అందుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలు నిర్మించడంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొంతకాలం క్రితమే ఈమె కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రాన్ని నిర్మించింది. ఇది మంచి విజయం సాధించింది. అలాగే నిహారికకు పెద్ద మొత్తంలో లాభాలను కూడా తీసుకువచ్చింది.
ప్రస్తుతం ఈమె సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రాకాస అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీని ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో భాగంగా నిహారిక మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. నిహారిక మాట్లాడుతూ... "నేను దాదాపు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 2015లో డీ జూనియర్స్ అనే షోను స్టార్ట్ చేశాను.
అది స్టార్ట్ చేసిన తర్వాత నుండి మా నాన్నగారిని ఎప్పుడూ డబ్బులు అడగలేదు. ఆయన నాకు అందరూ ఆడపిల్లలకు ఇచ్చే విధంగా ఎంతో కొంత పాకెట్ మనీ ఇస్తుంటాడు. అది ఆయన ఆనందం కోసం మాత్రమే ఇస్తారు. కానీ ఆయన ఇచ్చే డబ్బులతో నేను సినిమాలను మాత్రం నిర్మించలేను. ఆ స్థాయిలో ఆయన డబ్బులు ఇవ్వరు" అని నిహారిక చెప్పుకొచ్చింది. కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ తో మంచి జోష్లో ఉన్న ఈ నిర్మాత రాకాస చిత్రంతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.






