- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేణు స్వామితో ప్రత్యేక పూజ చేయించుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. అందుకోసమేనా..?? వైరల్ అవుతున్న ఫొటోలు
బ్యూటీఫుల్ నిధి అగర్వాల్ ‘హరి హర వీరమల్లు’తో సత్తా చాటేందుకు వెయిట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా చేసిన హీరోయిన్.. ప్రతీ ఈవెంట్‌లోనూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నించింది.
దిశ, వెబ్ డెస్క్ : బ్యూటీఫుల్ నిధి అగర్వాల్ ‘హరి హర వీరమల్లు’తో సత్తా చాటేందుకు వెయిట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా చేసిన హీరోయిన్.. ప్రతీ ఈవెంట్‌లోనూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నించింది. సాంగ్స్ రిలీజ్ టైంలో స్టెప్స్ వేస్తూ ఆకట్టుకుంది. అయితే త్వరలో మూవీ రిలీజ్ కాబోతుండగా.. ప్రత్యేక పూజలు చేసింది ఈ బ్యూటీ. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిధి.. ప్రస్తుతం హరి హర వీరమల్లుపైనే ఆశలు పెట్టుకుంది. అభిమానులను కచ్చితంగా మెప్పిస్తాననే నమ్మకంతో ఉంది. మూవీలో ఇప్పటి వరకు చూడని నిధిని చూడబోతున్నారనే అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమాతో నంబర్ వన్ రేంజ్‌కు దూసుకుపోయేలా అవకాశాలు వెల్లువెత్తుతాయని అంటున్నారు. ఈ క్రమంలో నిధి ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామితో ప్రత్యేక పూజ చేయించుకుంది. ఈ ఫొటోలను స్వయంగా వేణు స్వామి సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.








