- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ పై స్పందించిన నిధి అగర్వాల్.. అలా కూడా మాస్ హీరోయిన్ అవ్వొచ్చు అంటూ కామెంట్స్..
యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కలిసి ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu) సినిమా చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కలిసి ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu) సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైంది. 2022 తర్వాత నిధి నటించిన తొలి తెలుగు సినిమా హరిహర వీరమల్లు కావడం విశేషం. ఈ సినిమాను ఏఎం రత్నం(AM Rathnam) భారీ బడ్జెట్‌తో నిర్మించగా, క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) & జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వం వహించారు. అయితే భారీ అంచనాల నడుమ ఈ మూవీ జూలై 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో నిధి అగర్వాల్ ప్రమోషన్ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. “మాస్ ఇమేజ్ రావాలంటే బికినీ, లిప్‌లాక్, ఇంటిమేట్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది కదా?” అని అడగ్గా, దానికి నిధి స్పందిస్తూ.. ‘అలాంటివి నేను చేయను. నా హద్దులు నాకు తెలుసు. నేను తల్లిదండ్రులతో కలిసి చూడలేని సన్నివేశాల్లో నటించను. అలాంటి సన్నివేశాలు చేయకపోయినా మాస్ హీరోయిన్ అవ్వొచ్చు. కష్టపడి పనిచేస్తాను, మంచి కథలు ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ లేకుండా సినిమాలు చేస్తావా అట్లా అయితే నీకు ఆఫర్లు వచ్చినట్టే అని షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.






