Nidhhi Agerwal: సినిమాలో రాణిలా కనిపించడానికి చాలా కష్టపడ్డాను.. హరి హర వీరమల్లు నటి సెన్సేషనల్ కామెంట్స్

by Kodari Anjali |

టైగర్ ష్రాఫ్‌ హీరోగా వచ్చిన మున్నామైఖేల్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్.

Nidhhi Agerwal: సినిమాలో రాణిలా కనిపించడానికి చాలా కష్టపడ్డాను.. హరి హర వీరమల్లు నటి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టైగర్ ష్రాఫ్‌ హీరోగా వచ్చిన మున్నామైఖేల్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్. మొదటి చిత్రంతోనే ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. 2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా వచ్చిన హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయికగా అవకాశం కొట్టేసింది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించారు.

అయితే ఈ చిత్రం నిన్న (జులై24) థియేటర్లలో గ్రాండ్ విడుదలైంది. మొదటిరోజే భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం హరిహర వీరమల్లు గురించి చర్చ కొనసాగుతోంది. ఇకపోతే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్ పలు కామెంట్స్ చేసింది. ఈ మూవీ కోసం మీరు మేకప్ కోసం ఎంత సమయం కేటాయించేవారని యాంకర్ సుమ అడగ్గా..

ఈ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ.. ‘సినిమాలో రాణిలా కనిపించడానికి చాలా కష్టపడ్డాను అని వెల్లడించింది. సాధారణంగా వేరే సినిమాలకు అయితే మేకప్ కోసం 30 నుంచి 45 నిమిషాలు టైమ్ తీసుకునేదాన్ని అని తెలిపింది. కానీ హరిహర వీరమల్లు కోసం దాదాపు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువే కేటాయించానని పేర్కొంది. హెయిర్ స్టైల్స్, ఎక్స్టెన్షన్, జ్యువెలరీ, డ్రెస్సింగ్.. ఇలా ఈ ఫిల్మ్ కోసం చాలా టైమ్ పట్టిందని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.

Next Story