వాట్ జూనియర్ ఎన్టీఆర్ సీరియల్‌లో కూడా నటించారా.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్..

by I. Sairam |   (  Updated:2025-08-16 05:52:03  IST  )

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వాట్ జూనియర్ ఎన్టీఆర్ సీరియల్‌లో కూడా నటించారా.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ఆయన ‘వార్-2’(WAR-2) సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్లుగా బిజీగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ గురించి అందరికీ తెలియని విషయం ఏంటంటే… తారక్ తన కెరీర్ ప్రారంభంలో ఓ టీవీ సీరియల్‌లో కూడా నటించారు. ఈటీవీ ప్రారంభ దశలో ప్రసారమైన “భక్త మార్కండేయ”(Bhaktha Markandeya) అనే సీరియల్‌లో ఆయన మార్కండేయుడి పాత్ర పోషించారు.

ఈ పాత్రలో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్నారు. ఈ సీరియల్ కొద్ది రోజులే ప్రసారమైనా, ఎన్టీఆర్ లుక్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్ననాటి నుంచే కళల పట్ల ఆసక్తి చూపించిన తారక్, కూచిపూడి, భరతనాట్యంలు నేర్చుకున్నారు. 1997లో బాల రామాయణం సినిమాతో చిన్న రాముడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా ఓ చిన్న సీరియల్‌తో స్టార్ట్ చేసిన అతని సినీ కెరీర్ నేడు స్టార్ హీరో అంతటి రేంజ్‌కి ఎదిగారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story