- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dhanush's 'Idli Kadai': అనుకున్న టైమ్‌కే వస్తుంది ఎలాంటి మార్పు లేదు.. ధనుష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా, దర్శకుడిగా వరుస మూవీస్ అనౌన్స్ చేస్తున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా, దర్శకుడిగా వరుస మూవీస్ అనౌన్స్ చేస్తున్నాడు. ప్రజెంట్ ఆయన స్వీయ డైరెక్షన్ (Self direction)లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’ (Idli Kadai). ఇందులో నిత్య మీనన్ (Nitya Menon) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రాజ్ కిరణ్, ప్రకాశ్ రాజ్, షాలినీ పాండే తరితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అకాశ్ భాస్కర్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్స్, అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య ‘ఇడ్లీ కడై’ మూవీ ఏప్రిల్ (April) 10న గ్రాండ్‌గా థియేటర్‌లో విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
కానీ గత కొద్ది రోజులుగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతున్నట్లు సోషల్ మీడియా (Social media)లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ధనుష్ తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఇడ్లీ కడై రిలీజ్‌పై వస్తున్న వార్తలపై యూనిట్ స్పందిస్తూ.. ‘అనుకున్న సమయానికే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తులు పట్టించుకోకండి’ అంటూ క్లారిటీ ఇచ్చారు.






