కొరియన్ మ్యూజిక్ స్టార్ట్.. కొత్త పోస్టర్‌తో హింట్ ఇచ్చిన టీమ్

by Chukka Sudharani |

ఒక అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌తో కనకరాజు త్వరలో రాబోతున్నాడు సిద్ధంగా ఉండండి అంటూ వరుణ్ తేజ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

కొరియన్ మ్యూజిక్ స్టార్ట్.. కొత్త పోస్టర్‌తో హింట్ ఇచ్చిన టీమ్
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం హర్రర్, కామెడీని రిఫ్రెషింగ్ క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో బ్లెండ్‌తో తెరకెక్కుతోంది. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా టీమ్ ఫైనల్ షెడ్యూల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ షెడ్యూల్‌లో పాటలు, కథలో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారని, వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనున్న ఈ షెడ్యూల్‌‌ను కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారని తెలిపారు. ఇక ఉగాది పండుగ సందర్భంగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు వరుణ్ రేడియో పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘కొంచెం తీపి, కొంచెం కారం, ఇంకా బోలెడంత స్వాగ్.. ప్రతి రుచితో నిండిన ఒక అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌తో కనకరాజు త్వరలో వెండితెరపైకి రాబోతున్నారు’ అని తెలిపారు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్ ఆధారంగా త్వరలోనే మ్యూజికల్ జర్నీ స్టార్ట్ కాబోతున్నట్లు హింట్ ఇచ్చారు చిత్ర బృందం.

Next Story