- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూవీ లవర్స్‌కు ఇక పండుగే.. ఈనెలలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నా సినిమాల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు
ఈ ఆగస్టులో సినీ ప్రియులను ఎంటర్‌టైన్ చేసేందుకు చాలా సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

దిశ, సినిమా: ఈ ఆగస్టులో సినీ ప్రియులను ఎంటర్‌టైన్ చేసేందుకు చాలా సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే.. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ‘సర్ మేడమ్’, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ ‘సన్నాఫ్ సర్దార్-2’ ఆగస్టు 1న ఆడియన్స్ మందుకు వచ్చి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటున్నాయి. ఇక వీడితో పాటు ఈనెలలో అలరించే మరిన్ని సినిమాలు గురించి తెలుసుకుందాం.
బకాసుర రెస్టారెంట్: కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో ఎస్‌జే శివ దర్శకత్వంలో రాబోతున్న కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్‌జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే.. ఈ హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. ఆగస్టు 8న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
కూలీ: సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’. మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, నాగార్జున, సాబిన్ షాహిర్, సత్యరాజ్, శృతిహాసన్, పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కళానిది మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
వార్-2: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్-2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ యాక్షన్ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు-14న థియేటర్స్‌లోకి రాబోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ వార్‌కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
పరదా: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతున్న ఈ మూవీకి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, ట్రైలర్, థీమ్ ఆఫ్ పరదా వీడియో అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగా.. పాజిటిల్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ మూవీ ఆగస్టు 22న రిలీజ్ కాబోతున్నది. ఇందులో దర్శనా రాజేంద్రన్, సంగీత కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
రివాల్వర్ రీటా: కీర్తి సురేష్ లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘రివాల్వర్ రీటా’. ఈ ఈ సినిమాకు జేకే చండూరు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యాషన్ స్టూడియో నిర్మిస్తోంది. ఇందులో కీర్తి సురేష్ పోలీస్ పాత్రను పోషిస్తుండగా.. రాధిక శరత్‌కుమార్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌తో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 27న రిలీజ్‌కు సిద్ధం అయింది.
సుందరకాండ: నారా రోహిత్ లేటెస్ట్ ఫీల్ గుడ్ తెలుగు డ్రామా ‘సుందరకాండ’. రోహిత్ కెరీర్‌లో 20వ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి వెంకటేష్ నిమ్మల పూడి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి విజయ్ కుమార్, వ్రితి వాఘావి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సందీప్ పిక్చర్స్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. రెండు విభిన్న ప్రేమకథలను పరిచయం చేయబోతున్న ఈ మూవీ ఆగస్టు 27న రిలీజ్ కాబోతుంది.
హృదయపూర్వం: మలయాళ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘హృదయపూర్వం’ ఒకటి. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బసితా జోసెఫ్, సంగీత్, సంగీత, లాలూ అలెక్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘హృదయపూర్వం’ షూటింగ్ ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
పరం సుందరి: సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట మూవీ ‘పరం సుందరి’. తుషార్ జలోటా దర్శకత్వం వహించాడు. బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిల్మ్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నార్త్ ఇండియా- సౌత్ ఇండియా కలయికలో రాబోతున్న ఈ లేటెస్ట్ లవ్ స్టోరీ ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అయింది.






