New Movies: ఫిబ్రవరిలో సినిమాల జాతర.. ఎన్ని చిత్రాలు రిలీజ్‌కు ఉన్నాయంటే?

by Ramesh Goud |

సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్న సినిమాలు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి.

New Movies: ఫిబ్రవరిలో సినిమాల జాతర.. ఎన్ని చిత్రాలు రిలీజ్‌కు ఉన్నాయంటే?
X

దిశ, సినిమా: సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్న సినిమాలు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే అత్యధిక చిత్రాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. వాటిలో..

Pattudala: అజిత్‌కుమార్‌, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం ‘విడాముయర్చి’. తెలుగులో ‘పట్టుదల’ పేరుతో రాబోతున్న ఈ మూవీకి మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడ‌క్షన్స్‌పై సుభాస్కర‌న్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Thandel: అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్’. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని.. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్స్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మ్యూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Laila: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుం రామ్ నారాయణ్ కాంబోలో ‘లైలా’ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వాలెంటైన్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 14 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

Dilruba: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా సినిమా ‘దిల్‌రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దిల్‌రూబా’ సినిమా ఫిబ్రవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

BrahmaAnandam: సీనియర్ నటుడు, స్టార్ కమెడీయన్ బ్రహ్మానందం, అతడి కొడుకు రాజా గౌతమ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్రలను పోషించారు. ఆర్.వి.ఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ‘బ్రహ్మా ఆనందం’ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

Mazaka: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ‘మజాకా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్రినాథ రావు నక్కిన తెరకెక్కిస్తుండగా.. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఇందులో రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. అన్షు అంబానీ, రితూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Next Story