Tollywod: పవన్ కళ్యాణ్ సాంగ్ టైటిల్ తో కొత్త సినిమా.. వైరల్ అవుతున్న పోస్టర్

by Phanindra |

ఇప్పటికి అలా ఎన్నో సినిమాలు వచ్చాయి.

Tollywod: పవన్ కళ్యాణ్ సాంగ్ టైటిల్ తో కొత్త సినిమా.. వైరల్ అవుతున్న పోస్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండీస్ట్రీలో లో హిట్ అయిన పాటల నుంచి టైటిల్స్ తీసుకుంటారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే, ఇప్పటికి అలా ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ లో " హే చికితా.. " ( Hey chikitha ) అనే పాదంతో టైటిల్ ని తీసుకుని సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP పతాకం పై ఎన్. అశోక RNS, గరుడవేగ అంజి నిర్మాణంలో ధనరాజ్ లెక్కల ( Dhanraj Lekkala ) డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో అబినవ్ మణికంఠ హీరోగా , దివిజ ప్రభాకర్, తన్మయి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్,అశోక్ వర్ధన్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత, సాయి నాయుడు, సాయి కౌశిక్, క్రాంతి, అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్.. నటీ నటులు నటిస్తున్నారు. శుక్రవారం " వాలెంటైన్స్ డే " సందర్భంగా చిత్రానికి సంబంధించిన " హే చికితా" ( Hey chikitha ) టైటిల్ పోస్టర్ ని దర్శకుడు అజయ్ భూపతి చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక యాంకర్ అనుసూయ భరద్వాజ్, డైరెక్టర్ సాయి రాజేష్ ,వశిష్ట ఎన్ సింహ ఇన్స్టా వేదికగా విడుదల చేశారు.

ఈ పోస్టర్ " హే చికితా" పాటలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్టైల్ తో కటౌట్ ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే " బద్రి " ( Badri ) మూవీలా వింటేజ్ కథతో మన ముందుకు రాబోతుందని తెలుస్తుంది. పవర్ స్టార్ ఫోటో పెట్టుకున్నాక పోస్టర్ వైరల్ అవ్వకుండా ఉంటుందా .. అదే రేంజ్లో ట్రెండ్ అవుతుంది. ఇక పవన్ అభిమానులు అయితే ఈ పోస్టర్ ని షేర్ చేయడమే కాకుండా .. స్టేటస్ లు పెట్టి వైరల్ చేస్తున్నారు. మరి, హే చికితా టైటిల్ తో ఎలాంటి కథతో తీస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం, ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.




Next Story