- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New movie: స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కొత్త సినిమా స్టార్ట్..
సోనుది ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం ఘనంగా స్టా్ర్ట్ అయింది.

దిశ, సినిమా: సోనుది ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం ఘనంగా స్టా్ర్ట్ అయింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ (RP Patnaik) తొలి షాట్‌కు క్లాప్ కొట్టగా.. దర్శకులు వీరశంకర్, నవీన్ ఎర్నేని, తనికెళ్ల భరణి (Tanikella Bharani) చిత్ర దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్యలకు స్క్రిప్ట్‌ను అందించారు. ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ టి, వంశీ కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత ఆర్ యు రెడ్డి (RU Reddy) మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ నుండి వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను మార్చి 6 నుండి ఊటిలో స్టార్ట్ చేస్తాం. మంచి కథతో నూతన దర్శకులతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలి షెడ్యూల్ తర్వాత రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశాం. మా సోనుధి నుండి ఏడాదికి కొన్ని సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సమాజం మాకు అండగా ఉండి ఎంతో ఇచ్చింది. మా వంతుగా మేము కూడా సమాజానికి మేలు చేసే మంచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. మా నటీనటులు, టెక్నీషియన్స్‌కి అభినందనలు’ అని అన్నారు. దర్శకులు కిట్టి కిరణ్ (Kitty Kiran), లక్ష్మీ చైతన్య (Lakshmi Chaitanya)లు మాట్లాడుతూ.. ‘మా టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం కల్పించిన నిర్మాత ఆర్ యు రెడ్డికి కృతజ్ఞతలు. సినిమాను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, సంధ్య జానక్, కెమెరా మెన్ జోషి తదితరులు పాల్గొన్నారు.






