- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తారక్ ఇంట్లో కొత్త సందడి.. జపనీస్ పేర్లతో ఆకట్టుకున్న పెంపుడు పక్షులు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నివాసంలోకి కొత్త అతిథులు వచ్చి చేరాయి. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త పెంపుడు పక్షులు (చిలుకలు) అభిమానులకు పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆకర్షణీయమైన చిత్రాలను పంచుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నివాసంలోకి కొత్త అతిథులు వచ్చి చేరాయి. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త పెంపుడు పక్షులు (చిలుకలు) అభిమానులకు పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆకర్షణీయమైన చిత్రాలను పంచుకున్నారు. జపాన్ దేశంపై ఉన్న ప్రత్యేక ప్రేమే కారణముగా ఆ పక్షులకు ఆయన ‘అసాహి’, ‘యూహి’ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. జపనీస్ భాషలో ‘అసాహి’ అంటే సూర్యోదయం అని, ‘యూహి’ అంటే సూర్యాస్తమయం అని అర్థం. ఈ పేర్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను తారక్ స్వయంగా బయటపెట్టడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
పుట్టినరోజు కానుకగా ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదల!
మరోవైపు, ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్’ కాంబినేషన్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. మే 20న తారక్ పుట్టినరోజును (HBD NTR) పురస్కరించుకుని మంగళవారం రాత్రి ఈ చిత్ర గ్లింప్స్ (Dragon Glimpse) ను విడుదల చేశారు. ఈ చిత్రానికి అధికారికంగా ‘డ్రాగన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
వచ్చే ఏడాది జూన్‌లో విడుదల
ఈ వీడియో ద్వారా చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కథా ప్రపంచాన్ని, అందులోని పాత్రలను వైవిధ్యంగా పరిచయం చేశారు. ఎన్టీఆర్ రగ్గడ్ లుక్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈలలు వేయించే పవర్‌ఫుల్ డైలాగ్
ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘దేవుడు నాకో గొప్పవరం ఇచ్చాడు.. ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం. నిదురపోయినప్పుడు నా కలలోకి నేను చంపిన వారి ముఖాలు రావు.. మిగిలున్న శత్రువుల ముఖాలే కనబడతాయి. పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు’ అంటూ తారక్ తన మార్క్ బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఒకేసారి ఇటు పెంపుడు పక్షుల ముచ్చట్లు, అటు క్రేజీ మూవీ అప్‌డేట్‌తో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.






