నీ ఏజ్ ఎంత అంటూ క్వశ్చన్.. హీరోయిన్ ఆన్సర్‌కు నెటిజన్ల షాకింగ్ రియాక్షన్..(పోస్ట్)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-14 06:43:26  IST  )

పూనమ్‌ బజ్వా(Poonam Bajwa) ‘మొదటి సినిమా’(Modati Cinema) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైంది.

నీ ఏజ్ ఎంత అంటూ క్వశ్చన్.. హీరోయిన్ ఆన్సర్‌కు నెటిజన్ల షాకింగ్ రియాక్షన్..(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: పూనమ్‌ బజ్వా(Poonam Bajwa) ‘మొదటి సినిమా’(Modati Cinema) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైంది. తన ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నాగార్జున వంటి బడా హీరోలతో కూడా నటించే అవకాశం దొరికింది. బాస్ సినిమాలో నయనతారతో పాటు నటించింది. హీరో అల్లు అర్జున్‌ నటించిన 'పరుగు' సినిమాలో హీరోయిన్‌కు అక్కగా కూడా నటించింది. తెలుగు సినిమాలోనే మాత్రమే కాదు కన్నడ, తమిళ్, మలయాళం అంటి చిత్రాల్లో కూడా పూనమ్ నటించింది. అయితే ఏమైందో ఏమో కానీ అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.

నిత్యం ఘాటు ఘాటు అందాలతో గత్తర లేపుతోంది. షార్ట్ డ్రెస్సులతో అదరహో అనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పూనమ్ తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అందులో ఆస్క్ ఎవే అని రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు వారికి నచ్చిన ప్రశ్నలను అడుగుతున్నారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీ వయసు ఎంత అని అడుగగా.. దానికి ఆమె 4 టు ద 0 అంటే 40 అని బర్త్‌డే పిక్ షేర్ చేసింది. దీంతో నెటిజన్లు వాట్ నీ ఏజ్ 40 ఆ అస్సలు అలా లేవు అంటూ షాకింగ్ రియాక్షన్లు ఇస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.


Next Story