- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాలు ఎందుకు చేయట్లేదని నెటిజన్ క్వశ్చన్.. వారి వల్లే మానేశానంటూ పవన్ కళ్యాణ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Em Pillo Em Pillado) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Em Pillo Em Pillado) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లలేకపోయింది. దీంతో సెకెండ్ హీరోయిన్‌గా నటించసాగింది. అలా నటించిన మూవీల్లో ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi) సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ఈ చిత్రంలో సమంత మెయిన్ రోల్ ప్లే చేసింది.
ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఒక పాప, బాబు ఉన్నారు. అయినప్పటికీ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటూ నెట్టింట హాట్ షోతో ఫాలోవర్స్‌కు హీట్ పెంచుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రణీత తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్సులో తన వైట్ స్కిన్ కలర్ కనిపించేలా హాట్ షో చేసింది. డిఫరెంట్ టైప్స్ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది.
ఇక ఈ పిక్స్ కింద ఓ నెటిజన్ సినిమాలు చేయడం ఎందుకు మానేశారు అని అడుగగా.. దానికి ఆమె స్పందిస్తూ కిడ్స్ కోసం అని చెప్పింది. ఇక ఆమె రిప్లై కింద మరో నెటిజన్ అసలు అది రీజనే కాదు ఎందుకంటే ఎంతమంది హీరోయిన్స్ ఇప్పుడు పిల్లలు పుట్టాక కూడా సినిమాల్లో యాక్ట్ చేయడం లేదు అని కామెంట్ చేశాడు. అలాగే మళ్లీ రీ ఎంట్రీ ఎప్పుడు అని మరికొంత మంది అడుగుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






