హీరోయిన్ నిధి అగర్వాల్‌పై నెటిజన్లు ఫైర్.. ఎవడబ్బ సొమ్ము అని అలా చేస్తున్నారంటూ చీవాట్లు

by Gugulothu.Kavitha |

సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

హీరోయిన్ నిధి అగర్వాల్‌పై నెటిజన్లు ఫైర్.. ఎవడబ్బ సొమ్ము అని అలా చేస్తున్నారంటూ చీవాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా మారుతి(Maruthi) డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

ఈ క్రమంలో నిధికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఆమె పై ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఒక పనిమీద విజ‌య‌వాడ‌కి వెళ్లిన నిధి ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించినట్లుగా పలు ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో ఈ విష‌యంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించే వాహనాలను వ్యక్తిగత, వాణిజ్య కార్యక్రమాలకు ఎలా ఉపయోగిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అలాగే ఎవడబ్బ సొమ్ము అని ప్రభుత్వ వాహనంలో తిప్పుతున్నారు తనని, ఆవిడ కేవలం డబ్బు తీసుకుని నటించే మామూలు మనిషి అంతే తనకోసం AP ప్రజల సొమ్ము వాడుతున్నారా అని జనసేన పార్టీని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి లేదా నిధి అగర్వాల్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాగా ఈ వివాదం ఎక్క‌డివ‌ర‌కు వెళుతుంది అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Link

Next Story