పెళ్లి పీట‌లెక్క‌బోతున్న చైల్డ్ ఆర్టిస్ట్‌.. బ్యాచిలర్ పార్టీ ఫొటోస్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నాగేశ్(Divya Nagesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న చైల్డ్ ఆర్టిస్ట్‌.. బ్యాచిలర్ పార్టీ ఫొటోస్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నాగేశ్(Divya Nagesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్నది ‘అరుంధతి’(Arundhati) చిత్రంలో చిన్నప్పటి అరుంధతిగా కనిపించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన కళ్లతో యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘సింగం పులి’(Singam Puli), ‘అపరిచితుడు’(Aparichitudu) వంటి చిత్రాల్లో నటించినా, కొంతకాలానికే చదువుల కోసం సినిమాలకు గుడ్‌బై చెప్పింది. కానీ సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. అయితే ఈ చిన్నది త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతోందన్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా సహనటుడు, కొరియోగ్రాఫర్ అయిన అజయ్ కుమార్‌(Ajay Kumar)తో ప్రేమలో ఉన్న దివ్య, ఈ ఏడాది జనవరిలో అతనితో నిశ్చితార్థం చేసుకుంది.

ఇక ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరు ఆగస్టు 18న పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలో దివ్య పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ చిన్నది తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ జరుపుకున్నది. ఇక ఆ పిక్స్‌కు.. ‘చివరిసారిగా ఒక చిన్న ముద్దు.. నా అమ్మాయిలకు నన్ను ఎలా ఏడిపించాలో తెలుసు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిన్నప్పటి అరుంధతిగా ఆకట్టుకున్న ఆ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పెళ్లికూతురు అయిందా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story