- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ యాంకర్‌తో అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఆది.. సూపర్ జోడీ అంటూ నెటిజన్ల కామెంట్స్
జబర్దస్త్ షో(Jabardasth Show)తో ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో(Jabardasth Show)తో ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది(Hyper Aadi) కూడా ఒకరు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. దీంతో అతనికి సినిమాల్లో కమెడియన్‌గా చేసే చాన్స్ కూడా వచ్చింది. దీంతో అక్కడ కూడా తన స్పాంటెనియస్ జోక్స్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
అయితే జబర్దస్త్ షోకు కొన్ని రోజులు సౌమ్య రావు(Sowmya Rao) కొంతకాలం యాంకర్‌గా చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమె మీద కూడా ఆది చాలా జోక్స్ వేసేవాడు. వీరిద్దరు శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) షోలో కూడా తమ పంచులతో ఆడియన్స్‌ను అలరించారు. ఇదిలా ఉంటే.. తాజాగా హైపర్ ఆది జబర్దస్త్ సౌమ్యతో కలిసి డ్యాన్స్ అదరగొట్టాడు. స్విట్జర్లాండ్‌లో వేకేషన్‌కు వెళ్లిన ఈ జంట ‘నా మనసుకేమయింది నీ మాయలో పడింది’ అనే సాంగ్‌కు క్యూట్ స్టెప్స్ వేశారు.
అయితే ఈ వీడియోను జబర్దస్త్‌షోలో లేడీ గెటప్ వేసే శాంతి స్వరూప్(Shanthi Swaroop) తన ఇన్‌స్టా(Instagram)లో షేర్ చేస్తూ ‘మై ఫేవరేట్ జోడి’ అని క్యాప్షన్ జోడించారు. దీంతో వీరిద్దరు చాలా సన్నిహితంగా ఉన్న ఈ వీడీయో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ జోడీ, పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






