మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి అంటూ నెటిజన్ కామెంట్.. ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే ఆన్సర్ ఇచ్చిన నిధి అగర్వాల్(ట్వీట్ వైరల్)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-29 07:18:37  IST  )

యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి అంటూ నెటిజన్ కామెంట్.. ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే ఆన్సర్ ఇచ్చిన నిధి అగర్వాల్(ట్వీట్ వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సవ్యసాచి సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది రీసెంట్‌గా పవర్ స్టార్ ప్రభాస్ నటించిన హరిహర వీరమల్లు సినిమాతో మనమందుకు వచ్చింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్' మూవీలో నటిస్తోంది. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

దీంతో ప్రమోషన్లలో భాగంగా నిధి '#Ask Nidhhi' పేరుతో 'X'లో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు క్రేజీ ఆన్సర్స్ చెప్పారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ 'నిధి తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి?' అని ప్రశ్నించగా... ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోలుగా... తాను హీరోయిన్‌గా ఉంటే సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ అయితే బాగుంటుందని ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిపై నెటిజన్లు రియల్‌గా ఇది సాధ్యం కాని కాంబో బట్ అయితే క్రేజీ ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story