- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమాకు హీరోయిన్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన యంగ్ హీరోయిన్.. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటున్న నెటిజన్లు
నేచురల్ స్టార్ నాని(NANI) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3).

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(NANI) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3). హిట్ ఫ్రాంచైజీలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి శైలేష్ కొలను(sailesh Kolanu) దర్శకత్వం వహిస్తుండగా.. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి తిపిర్నేని(Prashanth Thipirneni) నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నాని అర్జున సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈ మూవీ మే 1న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. శ్రీనిధి శెట్టి హిట్‌కు మూవీలో హీరోయిన్‌గా నటించడంతో పాటు ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేసిందట. ఇక ఈ విషయాన్ని స్వయంగా నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని విన్న నెటిజన్లు బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






