- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pooja Hegde: నోరుజారిన పూజా హెగ్డే.. అల్లు అర్జున్‌ను అవమానించిందంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు (వీడియో)
టాలీవుడ్ యంగ్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) ‘ఒక లైలా కోసం’ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) ‘ఒక లైలా కోసం’ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో తన నటనతో బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్(Allu Arjun), ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు(Mahesh Babu), చిరంజీవి(Chiranjeevi) వంటి స్టార్స్ సరసన నటించి బుట్టబొమ్మగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ రాకపోవడంతో పాటు ఐరన్ లెగ్ బిరుదు తెచ్చుకుంది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి కొద్ది రోజులు యాడ్స్ చేసింది.
ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. అయితే ఒకటి రెండు సినిమాల్లో కాదండోయ్ దాదాపు 6 సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసింది. అందులో ‘దేవా’, ‘రెట్రో’, ‘జన నాయగన్’(Jana Nayagan), దుల్కర్ సల్మాన్ సరసన ఓ మూవీ అలా మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇటీవల పూజా హెగ్డే, షాహిద్ కపూర్ కాంబోలో వచ్చిన ‘దేవా’ జనవరి 31న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘‘అలా వైకుంఠపురంలో’ తమిళ సినిమాను అయినప్పటికీ హిందీ ప్రేక్షకులు కూడా ఆదరించారు. వర్క్ మంచిగా ఉంది అందుకే రీచ్ అయింది. దువ్వాడ జగన్నాథం కూడా హిందీ ప్రేక్షకులు ఎగబడి చూశారు. కాబట్టి కంటెంట్ బాగుంటే ప్రేక్షకులకు భాషతో సంబంధం లేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన వారు ఆ మాత్రం తెలియదా నీ కెరీర్‌ను నిలబెట్టిన సినిమాలు మర్చిపోతావా అని ఫైర్ అవుతున్నారు. అలాగే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను అవమానించిందని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
"Ala Vaikunthapurramuloo is a Tamil film" - Pooja Hegde pic.twitter.com/BkXpLpBkOY
— Manobala Vijayabalan (@ManobalaV) February 4, 2025






