Sakshi Malik: హీరోయిన్‌ను చెంపదెబ్బ కొట్టిన కొరియోగ్రాఫర్.. వైరల్ వీడియోపై ఫైర్ అవుతున్న నెటిజన్లు

by Chukka Sudharani |

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సాక్షి మాలిక్..

Sakshi Malik: హీరోయిన్‌ను చెంపదెబ్బ కొట్టిన కొరియోగ్రాఫర్.. వైరల్ వీడియోపై ఫైర్ అవుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సాక్షి మాలిక్.. 2018లో సోను కే టిటు కీ స్వీటీ’ అనే సినిమాతో బిగ్ స్క్రీన్‌పై కూడా సందడి చేసింది. తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి 2023లో డ్రై డే అని మూవీతో అలరించిన ఈ అమ్మడు.. సినిమా పరంగా కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం బోల్డ్ ఫొటో షూట్స్‌తో సందడి చేస్తూ యువతను పిచ్చెక్కిస్తుంది. ఈ అమ్మడు ఇన్‌స్టా వేదికగా ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ కావడంతో పాటు.. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడుకి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో.. నటుడు అండ్ కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయల్ నటి సాక్షి మాలిక్‌ను చెంపదెబ్బ కొట్టగా.. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సందర్భం లేకుండా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియోపై కొంత మంది ఆగ్రహం వ్యక్తం చెయ్యగా.. మరికందరూ షాకింగ్‌గా కూడా రియాక్ట్ అయ్యారు. దీంతో తాజాగా ఈ వీడియోపై నటి సాక్షి మాలిక్ స్పందించింది. ‘ఇది మా యాక్టింగ్ క్లాస్ నుండి వచ్చిన వీడియో.. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశ్యం లేదు’ అని చెప్పింది. దీంతో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. లింక్

Next Story