‘కన్నప్ప’లో శివుడి పాత్రకు నో చెప్పిన స్టార్ హీరో .. మంచి చాన్స్ మిస్ చేసుకున్నాడుగా అంటున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa).

‘కన్నప్ప’లో శివుడి పాత్రకు నో చెప్పిన స్టార్ హీరో .. మంచి చాన్స్ మిస్ చేసుకున్నాడుగా అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకోగా.. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ముల్లోకాలను ఏలే పరమశివుడి పాత్రల్లో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దీంతో ఈ పోస్టర్ పై కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ప్రతి సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీనీ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘అక్షయ్ కుమార్ స్టార్టింగ్‌లో కన్నప్ప మూవీలో శివుడి పాత్రను తిరస్కరించాడు. దీంతో ఆ పాత్ర కోసం ఓ తమిళ స్టార్ హీరోను సంప్రదించాము. అయితే అతను కూడా నో చెప్పేశాడు’ అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

మరి ఇంతకీ ఆ హీరో ఎవరా అని తెగ వెతికేశారట. ఇక తెలిసిన సమాచారం ప్రకారం ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూర్య(Surya) అని తెలిసింది. అయితే అతను ఈ క్యారెక్టర్‌కి నో చెప్పడానికి ఓ కారణమే ఉందట. అదేంటంటే.. స్టార్ హీరో సూర్య అప్పటికే ‘కర్ణ’(Karna) అనే బాలీవుడ్‌ సినిమాకు సైన్ చేయడమేనట. దీంతో అతను ఈ ఆఫర్‌ను తిరస్కరించాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు మంచి చాన్స్ మిస్ చేసుకున్నావ్‌గా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story